టెక్ ఉద్యోగాలకు పెరిగిన డిమాండ్

by Harish |
టెక్ ఉద్యోగాలకు పెరిగిన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా గత ఏడాది కాలంలో సాంకేతిక రంగంలో ఉద్యోగ నియామకాలు భారీగా పెరిగాయి. అనేక వ్యాపారాలు ఆన్‌లైన్ విభాగంలోకి విస్తరించడం, కంపెనీలు టెక్ పరిష్కారాలపై ఆధారపడటం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం, వ్యాపారాల్లో టెక్ మౌలిక సదుపాయాలను పెంచడం, కార్యకలాపాలను సులభరీతిలో నిర్వహించేందుకు టెక్ ఉద్యోగుల అవసరం పెరగడం వంటి కారణాలు టెక్ ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఏర్పడిందని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ ప్లాట్‌ఫామ్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి హైరింగ్ రికవరీ ఆశాజనకంగా ఉందని, కరోనా ముందు, ఆ తర్వాత కూడా టెక్ ఉద్యోగాలకు ప్రాధాన్యత గమనించాలని ఇండీడ్ పేర్కొంది. ముఖ్యంగా అప్లికేషన్ డెవలపర్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, లీడ్ కన్సల్టెంట్ లాంటి టెక్ ఉద్యోగాలకు డిమాండ్ అధికంగా ఉందని వివరించింది. ఈ విభాగంలో 55-85 శాతం డిమాండ్ గమనించినట్టు నివేదిక అభిప్రాయపడింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ఇండీడ్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించామని, వివిధ విభాగాల్లో 150-300 శాతం వృద్ధిని చూశామని ఇండీడ్ నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, పూణె లాంటి మెట్రో నగరాల్లో నియామకాలు పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed