గెయిల్ ఇండియా నికర లాభం రూ. 1,504 కోట్లు

by Harish |
గెయిల్ ఇండియా నికర లాభం రూ. 1,504 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి(2020-21 financial year) జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గెయిల్ ఇండియా(Gail India) నికర లాభం(Net profit) 56.43 శాతం తగ్గి రూ. 654.33 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 1,503.67 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం(Consolidated income) 34 శాతం తగ్గి రూ. 12,180.62 కోట్లకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్(Lockdown) కారణంగా కంపెనీ పనితీరు ప్రభావితమైనట్టు సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో పేర్కొంది. అయితే, రానున్న కాలంలో సంస్థ సాధారణ స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. సెగ్మెంట్(Segment) వారీగా, సహజవాయువు మార్కెటింగ్(Natural Gas Marketing) ద్వారా వచ్చే ఆదాయం 37.83 శాతం తగ్గి రూ. 11,635.38 కోట్లకు చేరుకుంది. అయితే, పెట్రో కెమికల్స్(Petrochemicals) ద్వారా వచ్చే ఆదాయం 9.79 శాతం పెరిగి రూ. 1,221.69 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ధర 0.87 శాతం క్షీణించి రూ. 97.20 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story

Most Viewed