- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్వాల ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి బండ్ల వెంకటరామిరెడ్డి దివంగతులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాలకు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యేలు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం, మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య తదితరులు కృష్ణమోహన్ రెడ్డిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు బండ్ల వెంకట రామిరెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ మోహన్ రెడ్డి, ఆయన తల్లి రేవంతమ్మ, భార్య బండ్ల జ్యోతితో మాట్లాడి ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు గద్వాల చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటలకు తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో కొంతమంది మీడియా మిత్రులు పోలీసులతో వాదనకు దిగవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.