గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టు స్టే

by Shyam |
Fruit market
X

దిశ, డైనమిక్ బ్యూరో : గడ్డి అన్నారం మార్కెట్‌ తరలింపును ఈ నెల 18 వరకు నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకూ మార్కెట్‌ను యథాతధంగా కొనసాగించాలని కోర్టు పేర్కొంది. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా బాట సింగారానికి తరలించడంపై హోల్ సేల్ ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ జరిగింది.

బాట సింగారం మార్కెట్‌లో ఉన్న సదుపాయాలపై హైకోర్టు నియమించిన రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కోర్టుకు నివేదిక అందించారు. ఇంకా బాటసింగారం మార్కెట్‌లో కొన్ని పనులు పూర్తిచేయాల్సి ఉందని సూచించారు. నివేదికను పరిశీలించిన కోర్టు, మార్కెట్ తరలింపు విషయంలో వ్యాపారులకు తగిన సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. బాటసింగారంలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని మార్కెట్ కమిటీని ఆదేశించింది. అంతేకాకుండా గడ్డి అన్నారంలో ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అభినందించింది. ఈనెల 18 వరకు గడ్డి అన్నారంలో విక్రయాలు కొనసాగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

Advertisement

Next Story