కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపు

by vinod kumar |
కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపు
X

దిశ, రంగారెడ్డి: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌‌ను కోహెడకు తరలించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెల 23 నుంచి మార్కెట్‌ తరలింపు ప్రారంభం కావాలని, 27 నుంచి పండ్ల మార్కెట్‌ కోహెడ నుంచి కొనసాగాలన్నారు. శనివారం ఎన్‌టీఆర్ మార్కెట్‌లో పాలక మండలి, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటవుతున్న వ్యవసాయ మార్కెట్‌కు తరలించడంతో వ్యాపారులకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వాహనాలు గడ్డిఅన్నారం మార్కెట్‌కు రావడం వల్ల ట్రాఫిక్ సమస్యతోపాటు కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కష్టంగా మారిందన్నారు. మార్కెట్‌కు వచ్చిన వారంతా అక్కడ సరైన స్థలం లేకపోవడంతో సామాజిక దూరం పాటించకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. అందుకే మార్కెట్‌ను వెంటనే తరలిస్తున్నామన్నారు. మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు గడ్డి అన్నారం మార్కెట్‌ను సోడియం హైపోక్లోరైట్తో శుద్ధి చేయాలని నిర్ణయించారు.

Tags : gaddi annaram market, shifted to koheda, minister sabitha indra reddy, carona

Advertisement

Next Story