గచ్చిబౌలి క్వారంటైన్ కేంద్రం పరిశీలన

by vinod kumar |
గచ్చిబౌలి క్వారంటైన్ కేంద్రం పరిశీలన
X

దిశ, రంగారెడ్డి: గచ్చిబౌలిలోని స్పోర్ట్ టవర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ కేంద్రంలో దాదాపు 1200 మందిని క్వారంటైన్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. పంచాయత్ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌‌లు మంత్రులకు అక్కడ ఏర్పాటు చేసిన వసతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ నివారణకై చేపట్టిన చర్యలు, జిల్లాలో వలస కార్మికులకు అందిస్తున్న ఉచిత బియ్యం, నగదు పంపిణి తదితర విషయాలపై కలెక్టర్‌తో సమీక్షించారు.

Tags: Gachibowli quarantine centre, minister, ktr, etela, inspection

Advertisement

Next Story