గాలిలో ఎగిరే ఎలక్ట్రిక్ కార్‌కు రూపకల్పన

by Anukaran |
future of air-taxi transport
X

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్, శిలాజ ఇంధనాల ద్వారా నడిచే వాహనాల వినియోగం విపరీతంగా పెరగడం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మేరకు గ్లోబల్ వార్మింగ్‌ కారణంగా జీవవైవిధ్యం దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. సిచ్యువేషన్స్ ఇలానే కొనసాగితే.. భవిష్యత్తులో మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే కొవిడ్ సంక్షోభం వల్ల మానవాళి జీవనంలో గుణాత్మక మార్పొచ్చింది. ప్రజల్లో వ్యక్తిగత ఆరోగ్యంపై, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్‌పై అవేర్‌నెస్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై మొగ్గు చూపుతున్నారు. మరోవైపు భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని మార్కెటింగ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిలియన్ ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రేర్(Embraer) గాలిలో ఎగిరే ఎలక్ట్రిక్ కారును రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు విశేషాలు మీ కోసం..

ఈ నెల 1న ఓలా సంస్థ ఎయిర్‌ప్రో సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ ప్రకటనలో తాము ఆకాశంలోకి ఓ అడుగు ముందుకు వేశామని, అదే ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కారు తయారీ అని తెలిపింది. ‘ప్రపంచంలో మొట్టమొదటి పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారుకు హలో చెప్పండి. ఇది మా ప్రో వెర్షన్.. అందుకే దీన్ని ఓలా ఎయిర్‌ప్రో అని పిలుస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. అయితే ఓలా సంస్థ.. ఏప్రిల్ ఫూల్ చేయడం కోసం ఆ ట్వీట్ చేయగా, బ్రెజిల్‌కు చెందిన సంస్థ మాత్రం ఆ ఐడియాను ప్రాక్టికల్‌గా వర్కవుట్ చేసి, వర్కింగ్ ప్రొటోటైప్‌ను రూపొందించింది.

డ్రోన్ మాదిరిగా ఉండే ఈ కారు ద్వారా ప్యాసింజర్స్ వర్టికల్‌గా టేకాఫ్ అయి తమ డెస్టినేషన్‌కు రీచ్ కావొచ్చు. గత నెలలో బ్రెజిల్‌ ఏరోస్పేస్ దిగ్గజ కంపెనీ ‘ఎంబ్రేర్’ హెడ్‌క్వార్టర్స్ గవియా పీక్సొటాలో ఈ ప్రొటోటైప్ పనితీరును పరీక్షించారు. ఈ వెహికల్‌కు ‘ఈవీటీఓఎల్(eVTOL)’ అని నామకరణం చేశారు. చూసేందుకు అచ్చం డ్రోన్ మాదిరిగా ఉండే ఈ ఎలక్ట్రిక్ కారు ప్యాసింజర్స్‌ను ఫ్లైట్ మాదిరిగా రవాణా చేయగలదు. వర్టికల్ (నిలువు)గా టేకాఫ్ అయ్యేందుకు గాను దీనికి సెపరేట్ ఫుట్ ప్రింట్‌తో వర్కింగ్ స్పేస్ రెడీ చేయాల్సి ఉంటుంది. కాగా గంటకు 150 నుంచి 200 మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ ఎలక్ట్రిక్ వాహనం.. సింగిల్ చార్జ్‌తో 60 మైళ్ల వరకు ట్రిప్స్ వేయగలదు.

ఈ ఎయిర్ ఫ్లయింగ్ కారు ప్రాజెక్టు ‘ఈవ్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ సొల్యూషన్స్‌’కు చెందినది కాగా, ఇందులో ఎంబ్రేర్ కంపెనీ ఓ భాగస్వామి. అంతేకాదు ‘ఊబర్ ఎలివేట్ నెట్‌వర్క్‌’‌కు కూడా ఎంబ్రేర్ ఒక పార్ట్‌నర్ కంపెనీనే. కాగా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాక ‘భారత్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్’ దేశాల్లోనూ ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ప్రాజెక్ట్‌ టెస్టింగ్ చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఈ వర్కింగ్ ప్రొటోటైప్ చూడటానికి సైన్స్ ఫిక్షన్ మూవీ మోడల్‌లా ఉండగా.. ఈ ట్రాన్స్‌పోర్టేషన్ వైపు ప్రయాణికులను ఆకర్షించడం ఊబర్, ఎంబ్రేర్ కంపెనీల బాధ్యత. ఇవి మొబైల్ బుకింగ్స్ ద్వారా ప్యాసింజర్స్‌ను పికప్ చేసుకుని డెస్టినేషన్‌కు తీసుకెళ్తాయి. భారత్‌లో జనసమ్మర్థ నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ప్రపంచంలోని ఏ సిటీలోనైనా ప్రజలకు ఈ రవాణా మార్గం ఉపయోగపడుతుంది. ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ సక్సెస్ అయితే ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం లేదు.

సినిమాల్లో కనిపించే ఎగిరే కార్లు నిజజీవితంలో ఉండవనే ఆలోచన తప్పని నిరూపించిన ఈ బ్రెజిల్ ఏరోస్పేస్ ప్రొటోటైప్.. ఇంకా తయారీదశలోనే ఉంది. కాగా భవిష్యత్తులో సైన్స్, టెక్నాలజీ ఆధారంగా మానవ జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని చెప్పేందుకు ఈ ప్రొటోటైప్ ఒక ఉదాహరణ మాత్రమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story