- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకెక్కడి లాక్‌డౌన్.. ఇంకో4 గంటలు ఓపిగ్గా ఉండలేరా..!
దిశ, కరీంనగర్ సిటీ : లాక్‌డౌన్ మూలంగా 20 గంటల పాటు ఇళ్లకే పరిమితం అయిన జనాలు, గురువారం ఉదయం 6 గంటల నుంచే వీధుల్లోకి పోటెత్తారు. నాలుగు గంటల పాటు మినహాయింపును ఇవ్వటంతో ఒక్కసారిగా వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. కాలినడకన వచ్చిపోయే వారితో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు, ఆటోలతో నగర రోడ్లు కిక్కిరిసిపోయాయి. దీంతో ప్రధాన చౌరస్తాలన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపునివ్వగా, వివిధ పనుల నిమిత్తం, నిత్యావసరాలు తీర్చుకునేందుకు నగరవాసులు సూర్యోదయం నుంచే వీధుల్లోకి వచ్చారు. దీంతో, పలు వ్యాపార కూడళ్ళు అయిన టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, ప్రకాశం గంజ్, కూరగాయల మార్కెట్, తదితర ప్రాంతాలు తీవ్ర రద్దీగా మారాయి. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు లావాదేవీలతో బిజీ అయ్యాయి. హోల్‌సేల్ వ్యాపారులంతా కొద్దికాలంగా ఆన్లైన్, వాట్సాప్‌ల ద్వారానే క్రయ విక్రయాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమకు వచ్చిన ఆర్డర్‌ల ద్వారా ఎగుమతులు చేయటంలో నిమగ్నమయ్యారు. ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సరుకు రవాణా చేస్తుండగా, వచ్చిపోయే వాహనాలతో నగరంలోని వ్యాపార కూడలి అయిన ప్రకాశం గంజ్ ఇసుకేస్తే రాలనట్లుగా మారింది.