4 రోజులు పూర్తిగా లాక్‌డౌన్ : కలెక్టర్ ముషారఫ్‌ అలీ

by Aamani |
4 రోజులు పూర్తిగా లాక్‌డౌన్ : కలెక్టర్ ముషారఫ్‌ అలీ
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ పట్టణంలో శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు పూర్తిగా లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ ప్రకటించారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో పోలీస్, వైద్య, మున్సిపల్ అధికారులతో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు పూర్తిగా లాకౌడౌన్ అమలు చేస్తామని తెలిపారు. అంబులెన్స్ సేవలు, నిత్యావసర సరుకుల వాహనాలకు తప్పా వేరే ఏ ఇతర టూ వీలర్‌, ఫోర్‌వీలర్‌లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తాయని తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు పాల్గొన్నారు.

Tags: nirmal,full lackdown,four days,collector mushrraf ali sharuqi

Advertisement

Next Story