రూ. 2 తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు!

by Harish |
రూ. 2 తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ .2 తగ్గింది. ఢిల్లీలో పెట్రోల్‌ లీటరుకు 2.69 రూపాయలు తగ్గి 70.29 వద్ద ఉంది. డీజిల్‌ 2.33 రూపాయలు తగ్గి 63.01 గా ఉంది. అంతర్జాతీయ పరిణామాలతో ముడి చమురు ధరలు సోమవారం ఏకంగా 31 శాతానికి పైగా దిగజారాయి. ప్రస్తుతం చమురు ధరల్లో పెట్రోల్ 9 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకోగా, డీజీల్ 13 నెలల కనిష్ఠ స్థాయిలో ఉంది. ఇక మంగళవారం కమొడిటీ మార్కెట్లో పెట్రోల్ 30 పైసలు, డీజిల్ 25 పైసలు తగ్గగా, బుధవారం ఏకంగా రూ. 2 పైగా తగ్గడం గమనార్హం.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పరిశీలిస్తే.. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 70.29గా ఉంది. డీజీల్ లీటర్‌కు రూ. 63.01గా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటర్ రూ. 75.99, డీజిల్ రూ. 65.97తో విక్రయం జరుగుతోంది. చెన్నైలో పెట్రోల్ రూ. 73.02 ఉండగా, డీజిల్ రూ. 66.48గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ. 72.70, డీజిల్ రూ. 65.16గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 74.72, డీజిల్ రూ. 68.60 వద్ద విక్రయమవుతోంది.

కరోనా వైరస్ నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఉద్దీపన చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం పతనం నుంచి బ్రెంట్ ముడి చమురు ధరలు 8.3 శాతం నుంచి 4 శతానికి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 3.9 శాతం తగ్గి 38.66 డాలర్లకు చేరుకుంది.

tags:Petrol Price, Petrol, Diesel Price, Petrol Prices, Diesel, Petrol Price Hike, Fuel Prices, Price Today

Advertisement

Next Story