‘మిస్స్‌డ్ కాల్ ఇస్తే చాలు.. ఇంటికే పండ్లు’

by Shyam |
‘మిస్స్‌డ్ కాల్ ఇస్తే చాలు.. ఇంటికే పండ్లు’
X

దిశ, న్యూస్ బ్యూరో: 8875351555 నెంబర్‌కు ఒక్క మిస్స్‌డ్ కాల్ ఇస్తే చాలు.. ఇంటికే పలు రకాల పండ్లు తెచ్చిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ప్రత్యేక సేవలందిస్తున్న ‘వాక్ ఫర్ వాటర్’ సంస్థ ఎండీ కరుణాకర్‌ రెడ్డి ప్రయత్నాన్ని సోమవారం హైదరాబాద్‌లో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాక్ ఫర్ వాటర్ సంస్థతో కలిసి ఫామ్ టు హోమ్ సేవలందిస్తున్నామని చెప్పారు. మిస్స్‌డ్ కాల్ ఇవ్వగానే ఎస్‌ఎమ్ఎస్ రూపంలో ఆర్డర్ పత్రం వస్తుందని, అందులో ఎన్ని పండ్లు కావాలో.. చిరునామా తదితర వివరాలు తెలియజేస్తే 78 గంటల్లోగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని తెలిపారు. రూ.300కే మామిడి(1.5 కిలో), బొప్పాయి(3 కిలోలు), నిమ్మ(12) కాయలు, పుచ్చ(3 కిలోలు), బత్తాయి(2 కిలోలు), సపోట(1 కిలో) డెలివరీ చేస్తామన్నారు.

కరోనా మూలంగా వ్యాపారం లేక పండ్లన్నీ తోటల్లోనే మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ పరిస్థితుల్లో పండ్లు ఖరీదు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. దాతలు ముందుకొచ్చి ఆర్డర్ చేస్తే వారి తరపున ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు అందజేస్తారని మంత్రి తెలిపారు. దాతలు పెద్ద మనసు చేసుకొని పండ్లు ఆర్డర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ పద్ధతిలో 30 వేల కుటుంబాలకు పండ్లు సరఫరా చేశామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

tags : telangana, corona, fruits, farmers, delivery at home

Advertisement

Next Story

Most Viewed