ఇంటి పనుల్లో పురుషులకు ట్రైనింగ్.. లింగ సమానత్వానికి కేరళ న్యూ స్టెప్!

by Shyam |
men cooking
X

దిశ, ఫీచర్స్ : ఇంటిల్లిపాదికి కావాల్సిన టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ఏది కావాలన్నా అమ్మ, అక్క, చెల్లి లేదా భార్య, కూతురు ఇలా మహిళలు వడ్డించాల్సిందే. కిచెన్ క్లీనింగ్ నుంచి గార్డెన్ పనుల వరకు అంతా మనింటి మహారాణులే చేయాల్సి ఉంటుంది. వారు ఉద్యోగాలు చేస్తున్నా.. ఇంటి పని భారం మాత్రం తప్పడం లేదు. యుగయుగాలుగా, తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయానికి ముగింపు పలికేందుకు.. లింగ సమానత్వ పోరాటాలు జరుగుతున్నాయి. కానీ కిచెన్‌‌లో మాత్రం ఆ కుంపటి ఇంకా రాజుకోలేదు. అక్కడ కూడా లింగ సమానత్వాన్ని సాధించేందుకు కేరళ ప్రభుత్వం న్యూ స్టెప్ తీసుకుంటూ.. ‘స్మార్ట్ కిచెన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బాలురు, పురుషులందరూ ఎక్స్‌పర్ట్ చెఫ్స్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతారు.

రాష్ట్రవ్యాప్తంగా బాలురు, పురుషులకు గృహోపకరణాల ఆచరణాత్మక శిక్షణను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. లింగ సమానత్వానికి కృషి చేస్తున్న రాష్ట్రంగా కేరళ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంటి పనిలో సమానత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (WCD) స్మార్ట్ కిచెన్ కార్యక్రమాన్ని చేపట్టింది. కుకింగ్ టు క్లీనింగ్.. పురుషులందరికి ఇంటి పనులకు సంబంధించిన విషయాల్లో చెఫ్స్ శిక్షణ అందించనున్నారు.

WCD అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రెటరీ అధ్యక్షతన ఒక కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్యానల్ ‘యాక్షన్ ప్లాన్’ రూపొందించిన తర్వాత ఇది ప్రభుత్వ ఆమోదం పొందాక అమల్లోకి వస్తుంది. ఇది సజావుగా సాగేందుకు, గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు వడ్డీలేని రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. వీటిని భార్యాభర్తల పేరిట సంయుక్తంగా కేటాయించనున్నారు. అదనంగా తక్కువ-ఆదాయ నేపథ్యాలకు చెందిన కుటుంబాలకు ఉచిత LNG సరఫరా ఇవ్వనున్నారు. ఇక పాఠశాలల్లో జెండర్-న్యూట్రల్ సబ్జెక్ట్‌ పాఠ్యాంశాలను పిల్లలకు పరిచయం చేయాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా వారు జెండర్ ఐడెంటిటీ, ఎక్స్‌ప్రెషన్, లైంగిక ధోరణి మొదలైన వాటి గురించి నేర్చుకుంటారని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed