థమ్సప్ బాటిల్‌లో ‘కప్ప’

by Anukaran |   ( Updated:2020-09-28 09:40:58.0  )
థమ్సప్ బాటిల్‌లో ‘కప్ప’
X

దిశ, వెబ్‌డెస్క్ : శీతల పానియం (థమ్సప్) బాటిల్‌లో ‘కప్ప’ దర్శనమిచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. మేడిపల్లిలోని మణి కిరాణం షాప్‌లో ఉన్న థమ్సప్ బాటిల్‌లో దుకాణా యజమానికి ‘కప్ప’ కనిపించింది.

దీంతో ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు థమ్సప్‌ బాటిల్స్‌లో పురుగులు, బల్లులు రావడం జరిగింది కానీ, కప్ప దర్శనమివ్వడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

Advertisement

Next Story