- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్ననాటి స్నేహితుడి కోసం…
దిశ, వెబ్‌డెస్క్: జీవితంలో స్కూల్ ఫ్రెండ్స్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండకపోయినా, వారితో కలిసి పెరిగిన అనుభవాలు మనతోనే ఉంటాయి. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసినా కూడా ఆ బంధం అంతే బలంగా ఉంటుంది. తమిళనాడుకు చెందిన ముత్తుకుమార్, కె నాగేంద్రన్‌లది కూడా అలాంటి స్నేహమే. ట్రక్ డ్రైవర్‌గా పనిచేసే 44 ఏళ్ల ముత్తుకుమార్ ఆర్థిక పరిస్థితి, కరోనా లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా కుంటుపడింది. లాక్‌డౌన్‌కు ముందు రూ. 10 వేల నుంచి 15 వేలు సంపాదించేవాడు. కానీ, లాక్‌డౌన్ తర్వాత కనీసం రెండు వేల రూపాయలు కూడా ఆదాయం లేదు. వీటికి తోడు ముత్తుకుమార్ ఇల్లు పెద్ద సమస్య. ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఉండే గుడిసె 2018లో వచ్చిన గాజా తుఫాన్ వల్ల పూర్తిగా నాశనమైంది.
సెప్టెంబర్‌లో తమ స్కూల్ టీచర్ ఇంట్లో ముత్తుకుమార్, తన చిన్ననాటి స్నేహితుడు కె.నాగేంద్రన్‌ను కలిశాడు. తర్వాత ముత్తుకుమార్ ఇంటికి వచ్చి చూసిన నాగేంద్రన్, వారి పరిస్థితి చూసి బాధపడ్డాడు. 30 ఏళ్ల తర్వాత కలిసిన తన స్నేహితుడి పరిస్థితి ఇలా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే తమ స్కూల్ స్నేహితులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, ముత్తుకుమార్ ఇంటి ఫొటోలను వారి పరిస్థితి గురించి పోస్ట్ చేశాడు. అంతే..స్నేహితులందరూ తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మూడు నెలల్లో రూ. 1.5 లక్షలతో కొత్త ఇల్లు కట్టించారు. మొన్న దీపావళికి ముత్తుకుమార్‌కు ఆ ఇంటిని బహుమతిగా ఇచ్చారు. అలాగే పక్కనే ముత్తుకుమార్ తల్లికి కూడా ఒక గుడిసె వేశారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడిన స్నేహితులకు మీకు తోచినంత సాయం చేసి స్నేహం గొప్పదనాన్ని చాటిచెప్పాలని నాగేంద్రన్ పిలుపునిచ్చారు.