ఈ రాశి వారు తోబుట్టువులకు అప్పు ఇవ్వకండి.. ఎందుకంటే?

by Anukaran |
Panchangam
X

తేది : 13, ఆగష్టు 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(నిన్న సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 41 ని॥ వరకు)
నక్షత్రం : హస్త
(నిన్న ఉదయం 8 గం॥ 53 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 59 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 9 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ వరకు)

మేష రాశి: అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. చుట్టాల రాకతో ఇల్లంతా సందడి. వారితో ఆనందంగా గడపండి. ఆడంబరాలకు కోసం ఖర్చు పెట్టకండి. బంగారు భవిష్యత్తు కోసం నేటి నుంచే పొదుపు చేయండి. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. సామరస్యం సహనంతో వ్యవహరించడం మంచిది. విద్యార్థులు ఇంటర్నెట్ ను చదువు కొరకు కాకుండా ఉపయోగించడం వలన సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోండి. దానివలన మీ వైవాహిక జీవితం ఆనందకరం.

వృషభ రాశి: సహనంతో వ్యవహరించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనుల మీద శ్రద్ధ పెట్టండి తప్పులు జరగకుండా చూసుకోండి. అవసరం ఉన్నవారికి హెల్ప్ చేయండి. మానవసేవే మాధవసేవ. ఆదాయం పరవాలేదు. నూతన పెట్టుబడులు కై పథకాల గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. పంటి నొప్పి బాధించవచ్చు ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోనేలా నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

మిధున రాశి: సరైన ప్రణాళిక సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కంట్రోల్ తప్పి మాట్లాడకండి. గందరగోళం వదిలేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ పెండింగ్ ఉండడం వలన మానసిక అశాంతి. నూతన పరిచయాలు. పాత స్నేహితులతో మాట్లాడండి. ఆదాయం పరవాలేదు దుబారా ఖర్చులను నివారించండి. విదేశీ వ్యాపారం చేసే వారు లాభాల కోసం ఎదురు చూడండి. అధిక శ్రమ వలన వెన్నునొప్పి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి: మీ శక్తిసామర్ధ్యాలను వెలికి తీయండి అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఇతరులు బానిసలు కాదు మీకు పని చేయటానికి. వారితో సామరస్యంగా ప్రవర్తించండి. ప్రతి విషయాన్ని సమస్యగా చూడకండి. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. పాత స్నేహితులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు. కొందరికి ఈ ప్రపంచాన్ని వదిలి ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. కావలసినంత ధనం చేతికందుతుంది ఆడంబరాల కోసం ఖర్చు పెడతారు. ఏ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం దానివలన మీ వైవాహిక జీవితం ఆనందకరం.

సింహరాశి: ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. దైవప్రార్థన వలన మానసిక బలం రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం. రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. ఇతరుల జాలి కోసం ప్రయత్నించకండి. ఆఫీసు పనులు పెండింగ్ పెట్టడం వలన ఇబ్బందులు రావచ్చు సకాలంలో పూర్తి చేయండి. తోటి ఉద్యోగులు మీ మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు జాగ్రత్త ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కన్య రాశి: పరిస్థితులకు అనుగుణంగా సహనంతో వ్యవహరించండి. మీ జీవితం మీకు దేవుడిచ్చిన వరం దానిని జాగ్రత్తగా కాపాడుకోండి. తోబుట్టువుల ద్వారా ఇబ్బంది కలగవచ్చు జాగ్రత్త. వ్యాపార రహస్యాలను ఇతరులతో పంచు కోకండి. ఆఫీసులో ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం వలన మానసిక వేదన. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. మీ పిల్లల చదువు విషయాలను గమనించండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

తులారాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం పట్టుదల అవసరం. పనులలో ఇబ్బందుల వలన బాధ. దైవ ప్రార్ధన వలన సరైన ఆలోచనలు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. ఆఫీసు పనులలో తప్పులు జరిగే అవకాశం. సరైన ప్రణాళికతో శ్రద్ధ పెట్టి పని చేయండి. కొత్తగా కొన్న వస్తువు లు పని చేయకపోవడం వలన మానసిక శాంతి. అనుకోని ఖర్చుల వలన డబ్బుకి ఇబ్బంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం వలన మీ వైవాహిక జీవితం ఆనందకరం.

వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. ఆఫీసు పనులలో మీ సామర్థ్యంపై అందరి ప్రశంసలు తోబుట్టువులకు అప్పు ఇవ్వడం వలన మీ ఆదాయ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. విద్యార్థులు టీవీ మొబైల్ వాడకం వలన సమయం వృధా. విజయం సాధించాలంటే చదువు మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

ధనుస్సు రాశి: ఈరోజు పూర్తి ఆరోగ్యంతో ఆత్మవిశ్వాసంతో గడుపుతారు. ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలను సులభంగా సాధిస్తారు ఆదాయం పర్వాలేదు. ఇంటికి కావలసిన వస్తువుల కొరకు ఖర్చు పెడతారు. మీ కుటుంబ వ్యవహారాల గురించి ఇతరులతో చర్చించకండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నూతన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరు ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి: మీ చేతికి అందినదే మీది. దైవ ప్రార్ధన వలన మానసిక బలం సరైన ఆలోచనలు. అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల వలన అనుకోని ధనలాభం. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు అందుకని ముఖ్యమైన నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. పనులు సకాలంలో కాకపోవటం వలన విసుగు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కుంభరాశి: గందరగోళం నెగిటివ్ ఆలోచనలను వదిలివేయండి. ప్రతి చిన్న ఇబ్బందిని భూతద్దంలో చూసి కంగారు పడటం మానేయండి. ఆదాయం పర్వాలేదు. అనుకోని ఖర్చులు వలన డబ్బుకి ఇబ్బంది. అనుకోని అతిథుల రాక వలన ఆనందం. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ పనులు సకాలంలో కాకపోవటం వలన టెన్షన్. బయటి తిండి వలన అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేయండి ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోండి.

మీన రాశి: మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు వలన మీకు లాభం. ఆఫీసు పనులలో మీ నిబద్ధత మరియు సామర్ధ్యం పై అందరి ప్రశంసలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ తోబుట్టువులకు అప్పు ఇస్తారు. చిరకాల స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తల సామరస్య ధోరణి వలన మీ కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం.

Advertisement

Next Story