శుక్రవారం పంచాంగం, రాశి ఫలాలు (09-04-2021 )

by Anukaran |   ( Updated:2021-04-08 22:00:29.0  )
panchamgam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి : త్రయోదశి తె4.45వరకు
(తెల్లవారితే శనివారం)
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : శతభిషం ఉ5.56
తదుపరి పూర్వాభాద్ర
యోగం : శుక్లం మ2.26
తదుపరి బ్రహ్మం
కరణం : గరజి సా4.33
తదుపరి వణిజ తె4.45
వర్జ్యం : మ12.37 – 2.17
దుర్ముహూర్తం : ఉ8.19 – 9.08 &
మ12.25 – 1.14
అమృతకాలం: రా10.39 – 12.20
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం: మ3.00 – 4.30
సూర్యరాశి: మీనం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 5.53
సూర్యాస్తమయం: 6.10

మేషం

​సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి ఊహించని శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక సమస్యలు నుండి బయటపడతారు. అప్రయత్నంగా పనులలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

వృషభం

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంట బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. సేవ కార్యక్రమాలు నిర్వహించి విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు, ఉద్యోగాలలో అధికారుల సహాయం సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిధునం

ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు శ్రమ కలిగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ చింతన కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రయత్నాలు చెయ్యకపోవడంమంచిది. ఉద్యోగ ప్రయత్నాలలో ప్రతిష్టంభనలు.

కర్కాటకం

అనుకున్న పనులు మధ్యలో విరమిస్తారు.మిత్రుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు, ఉద్యోగమున మిశ్రమ ఫలితాలుంటాయి.

సింహం

అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్థుల పని తీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు.

కన్య

దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. ఋణాలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో పెద్దలతో చర్చలు మంచి ఫలితాలు వస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు.

తుల

ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యయప్రయాసలతోకాని పనులు పూర్తికావు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. గృహమున గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎంత కష్టపడినా గుర్తింపు లభించదు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

మానసిక అశాంతి కలుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మిత్రులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి.

ధనస్సు

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. దాయాదులతో భూవివాదాలు పరిష్కరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాల ధైర్యంగా నిర్ణయాలు చేసి లాభపడతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి.

మకరం

చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. కొన్నివ్యవహారాలలో నిలకడలేని ఆలోచనలు చేస్తారు. ఇంటాబయటా సమస్యలు మరింత పెరుగుతాయి. నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

కుంభం

విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ పెద్దల ఆదరణ కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

మీనం

ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా నిరాశ కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి లభించదు.

Advertisement

Next Story