- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండు కుండను తలపిస్తోన్న ప్రకాశం బ్యారేజ్
దిశ, ఏపీ బ్యూరో: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. రోజురోజుకు వరదప్రవాహం పెరుగుతుండటంతో 80 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. సాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్రన్ మరియు వెస్ట్రన్ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 83,139 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 73,890 క్యూసెక్కులు. మెుత్తం 30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. సోమవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని..లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులను కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు.