- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్వెరెవ్, సిట్సిపాస్, సెరేనా ముందంజ
దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ 4వ రోజు టాప్ సీడ్ ఆటగాళ్లు పాజిటివ్ ఫలితాలు సాధించారు. ఆరో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ అన్‌సీడెడ్ ఆటగాడు రోమన్ సఫియులిన్‌పై 7-6 (7-4), 6-3, 7-6(7-1) తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. జ్వెరెవ్ ఈ మ్యాచ్‌లో 10 డబుల్ ఫాల్ట్స్ చేసినా 15 ఏస్‌లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. రెండో సెట్ తప్ప మిగిలిన సెట్లలో రోమన్ గట్టి పోటీ ఇచ్చాడు. తొలి, ఆఖరి సెట్లు రెండూ టై బ్రైకర్‌కు వెళ్లడం గమనార్హం. మరో మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ వన్ స్టెఫానోస్ సిట్సిపాస్ 6-3, 6-4, 6-3 తేడాతో మార్టినెజ్‌పై సునాయాసంగా విజయం సాధించాడు. 23వ సీడ్ కచనోవ్‌పై అన్‌సీడెడ్ ఆటగాడు నిశికొరి 4-6, 6-2, 2-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరాడు.
మహిళల సింగిల్స్‌లో విక్టోరియా అజరెంక 7-5, 6-4 తేడాతో టాసన్‌పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో సెరేనా విలియమ్స్ 6-3, 5-7, 6-1 తేడాతో బుజనెస్కుపై విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నది. తొలి సెట్ సునాయాసంగా నెగ్గిన విలియమ్స్‌ను బుజనెస్కు రెండో రౌండ్లో అడ్డుకున్నది. 3-0 పాయింట్లతో ముందుకు వెళ్లిన విలియమ్స్‌ను వెనక్కు నెట్టి 7-5 తేడాతో బుజనెస్కు సెట్ గెలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో విలియమ్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 6-1 తేడాతో గెలిచింది. ఈ విజయంతో సెరేనా విలియమ్స్ మూడో రౌండ్‌కు చేరుకున్నది. ఇక మహిళల డబుల్స్‌లో తొలి సారిగా జట్టు కట్టిన వీనస్ విలియమ్స్, కోకా గాఫ్ మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగారు. ఝెంగ్, పెరెజ్ జోడీపై 7-6 (7-5), 4-6, 3-6 తేడాతో పరాజయం చెందారు.
- Tags
- French Open