13 ఏళ్ల తర్వాత బ్రిట్నీకి.. ఫ్రీడమ్..

by Shyam |
13 ఏళ్ల తర్వాత బ్రిట్నీకి.. ఫ్రీడమ్..
X

దిశ, సినిమా: మొత్తానికి బ్రిట్నీ స్పియర్స్ ఫ్రీ బర్డ్ అయిపోయింది. 13 ఏళ్ల తండ్రి కన్జర్వేటర్‌షిప్ నుంచి ఫ్రీడమ్ పొందింది. 2008లో తలెత్తిన మానసిక సమస్యలతో బ్రిట్నీ సతమతమయింది. ఆ సమయంలో తండ్రి జేమ్స్‌ ఆమె సంరక్షణ బాధ్యతలను చేపట్టారు. అప్పటి నుంచి తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ తనే నిర్ణయాలు తీసుకునేవాడు. చివరికి తన ఆస్తి, భాగస్వామి, పెళ్లి, పిల్లల విషయంలోనూ స్వేచ్ఛనివ్వలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో తన జీవితాన్ని నరకంగా మార్చేశాడు.

దీంతో తన జీవితాన్ని తనకు తిరిగి ఇప్పించాలని, కన్జర్వేటర్‌షిప్‌ను రద్దు చేయాలని బ్రిట్నీ న్యాయస్థానాన్ని వేడుకుంది. దీనిపై విచారించిన అమెరికా లాస్ ఏంజిల్స్ కోర్టు.. జేమ్స్‌ను బ్రిట్నీ సంరక్షణా బాధ్యతల నుంచి రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ‘బ్రిట్నీ స్పియర్స్​స్వేచ్ఛా పోరాటం ఫలించింది. తండ్రి జేమ్స్ స్పియర్స్ చెర​నుంచి విముక్తి దొరికింది. ఇప్పటి నుంచి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయ్ బ్రిట్నీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story