సింగరేణి కార్మికులకు ఫ్రీ వ్యాక్సినేషన్ : ఎండీ శ్రీధర్

by Shyam |
సింగరేణి కార్మికులకు ఫ్రీ వ్యాక్సినేషన్ : ఎండీ శ్రీధర్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా ఉధృతి వేగంగా విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో రోజువారీగా 6 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ఆక్సిజన్ సిలిండర్ల కొరత కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు నెల రోజుల వ్యవధిలో అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ అందజేయనున్నట్లు గురువారం ప్రకటించారు. అంతేకాకుండా సింగరేణి వ్యాప్తంగా కోవిడ్ ప్రత్యేక వార్డులు, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పిటికే 1200 పడకలను ఎమర్జెన్సీ నిమిత్తం సిద్ధం చేసినట్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా పెద్దఎత్తున కోవిడ్ టెస్టులు చేస్తున్నామన్నారు. అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌ను సింగరేణి సంస్థ అందిస్తుందని ఎండీ శ్రీధర్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed