- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సై, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ
దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ సంక్షోభం నుంచి ఆన్ లైన్ లో శిక్షణ కొనసాగిందని, ఇక ఆఫ్ లైన్ లోనూ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 11 స్టడీ సర్కిళ్లలో ఈ నెల 22 వ తేదీనుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.
జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ తదితర అంశాలపై 60 రోజుల పాటు ఉచిత శిక్షణను ఇవ్వనున్నారు. ఈ కోచింగ్ కోసం 15,622 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి బ్యాచ్ ల వారీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బాలాచారి పేర్కొన్నారు. ఇదివరకే నమోదు చేసుకున్న అభ్యర్థులు వారికి దగ్గరలోని స్టడీ సర్కిల్ కి వెళ్లి అడ్మిషన్ పొందవచ్చన్నారు.