- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉచిత వైద్య శిబిరం గ్రాండ్ సక్సెస్
దిశ, కరీంనగర్ సిటీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. కోవిడ్ వారియర్స్‌గా పేర్కొన్న మహిళా వైద్య సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. నగరంలోని సాయి శరణ్య ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ మెగా హెల్త్ క్యాంపు జరిగింది. ఇందులో 120 మందికి పైగా పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొని దీర్ఘ కాలిక వ్యాధులు, నివారణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ ఆడెపు శైలజ, డాక్టర్ ప్రీతి, డాక్టర్ శైలజ, డాక్టర్ ఆకుల శైలజ, డాక్టర్ సంధ్య, డాక్టర్ రత్నమంజరి, డాక్టర్ వసంతరావు, డాక్టర్ రవీంద్రన్, డాక్టర్ ప్రశాంతి,డా. రేఖ, డాక్టర్ ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.