- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ కథనానికి మంత్రి కేటీఆర్ స్పందన .. ఇకపై అన్నపూర్ణ క్యాంటిన్లలో ఉచిత భోజనం
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, పలు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి భారీగా పెరుగుతోంది. పేషెంట్స్ వెంట వస్తున్న బంధువులతో పాటు అన్నార్థులు కూడా ఆస్పత్రుల వద్ద ఉండే జీహెచ్ఎంసీ అన్నపూర్ణ సెంటర్ల వద్దే భోజనం చేస్తున్నారు.దీంతో అన్నపూర్ణ క్యాంటిన్లకు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే జీహెచ్ఎంసీ భోజనం అందిస్తోంది.
అది కూడా ప్లేట్‌కు రూ.5 వసూలు చేస్తోంది. అయితే, విపత్కర పరిస్థితుల్లో రెండు పూటలా భోజనం అందించాలని పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతేడాది ఉచితంగా పేదల కడుపునింపిన జీహెచ్ఎంసీ ఈసారి ఫ్రీగా అందించేందుకు వెనుకాడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘అన్నం పెట్టండి మహాప్రభో’ శీర్షిక పేరిట ‘దిశ’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ మంగళవారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని 250 అన్నపూర్ణ క్యాంటిన్లలో ఉచితం ఆహారం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉచితంగా భోజనాన్ని అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.