- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా పేషంట్లకు ఫ్రీ ఫుడ్.. ఈ నెంబర్లకు కాల్ చేయండి
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్నా..’ అన్న చందంగా కరోనా బాధితులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో మేమున్నామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. కోవిడ్ బాధితులను ఆదుకంటూ, క్యారెంటైన్‌లో ఉన్న వారికి భోజనాన్ని అందిస్తోంది నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్ధ ఆశ్రి సొసైటీ. ఈ సొసైటీ ద్వారా గత పది సంవత్సరాలుగా ఆశ్రి ఆర్పనేజ్ హోమ్‌ను నిర్వహిస్తున్న పూర్ణీ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి కోవిడ్ బాధితులకు ఉచితంగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌తో పాటు లంచ్, డిన్నర్ భోజనాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ పరిసర ప్రాంతాల్లో పూర్ణీ రెడ్డి నెల రోజులుగా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రతీ రోజు 150 నుంచి 200ల మందికి పైగా భోజనాన్ని అందిస్తున్నారు.
చిన్న నాటి నుంచి సమాజ సేవ..
ఊహా తెలియని వయస్సులోనే పూర్ణీ రెడ్డి తోటి వారికి సహాయ పడేది. అది సేవ అనే విషయం కూడా తనకు తెలిసేది కాదు.. అప్పటికే ఉన్నత స్థితిలో ఉన్న తన తల్లిదండ్రులు పూర్ణీరెడ్డికి సహకరించేవారు. దీంతో 2011 నుంచి ఆర్ఫనేజ్ హోమ్‌ను నడుపుతున్నారు. తన భర్త రామక్రిష్ణారెడ్డి సైతం భార్యకు సహకారం అందిస్తున్నారు. ఈవెంట్స్ రంగంలో ఉన్న తాను వచ్చిన సంపాదనను తన ఆర్ఫనేజ్ హోమ్ నిర్వహణ కోసం వెచ్చిస్తున్నారు. తల్లి దండ్రులు లేని పిల్లలైన 360 మందికి చదువును చెప్పిస్తున్నట్లు వివరించారు. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో నాలుగేళ్ల పాటు దాదాపు 150 మందికి ఉచితంగా భోజనాన్ని అందించారు. బొల్లారంలో 365 రోజుల పాటు నిత్యన్నదానం నిర్వహించారు.
విపత్కర పరిస్థితిలో అపన్న హస్తం.. పూర్ణీ రెడ్డి
కొవిడ్ వచ్చిన కుటుంబ సభ్యుల పరంగా మంచి ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని పూర్ణీ రెడ్డి అన్నారు. నెల రోజుల క్రితం యాభై మంది వరకు అందిస్తున్న ఈ ఉచిత భోజనం నేడు 200 వందల వరకు చేరాయని అన్నారు. అయితే కొవిడ్ బారినపడిన వారిలో చాలా మటుకు ప్రత్యేకంగా గర్భిణి స్త్రీలు, వృద్దులకు ఇస్తున్నామని వివరించారు. మియాపూర్ పరిసర ప్రాంతాల్లో కొవిడ్ బాధితులు ఎవరైనా ఉచిత భోజనం కోసం 92934 14444 నెంబర్‌ను సంప్రదించవచ్చని పూర్ణీ కోరారు.
షేరింగ్ కేరింగ్ కాన్ఫెప్ట్‌తో..
క్యారెంటైన్‌లో ఉన్న కరోనా రోగులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తూ తన సేవా భావాన్ని చాటుకుంటున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నిహారికా రెడ్డి. కరోనా రోగులకు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తాను సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వీడియోకు స్పందన లభించింది. దీంతో గత మూడు రోజులుగా నిహారికా రెడ్డి కరోనా రోగులకు మధ్యాహ్నం, రాత్రి వేళలో శాఖాహార భోజనాన్ని అందిస్తున్నారు. భోజనంలో అత్యధిక ప్రోటీన్లు కలిగిన వంటకాలే ఆమె మెనూలో ప్రత్యేకం. ప్రస్తుతం రోజుకు ఆమె లంచ్ అండ్ డిన్నర్ కోసం వంద మందికి ఈ ఆహారాన్ని, తన సొంత వాహనంలో అందిస్తున్నారు. జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మాత్రమే కరోనాతో హోమ్ క్యారెంటైన్‌లో ఉన్న వారికి అందజేస్తున్నారు.
హెల్దీ అండ్ హైజనిక్ పుడ్..
హెల్దీ అండ్ హైజనిక్ ఫుడ్, చక్కటి ప్రోటీన్లు కలిగిన వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసి అందిస్తూ, తన వంతు సహాయాన్ని చేస్తున్నారామే. మెనూలో ఇమ్యూనిటీ చాక్లెట్, డ్రైప్రూట్ లడ్డు, జీరా రైస్, ఆలూ కూర్మ, కీరా, క్యారెట్, బీట్ రూట్, పన్నీర్ కర్రీ, చపాతి వంటి వంటకాలను రెండు పూటలా అందిస్తున్నారు. కరోనాతో హోమ్ క్యారెంటైన్‌లో ఉంటూ, ప్రోటీన్స్ గల ఆహారం లభించక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసం తామే స్వయంగా ఇంట్లోనే వండి కరోనా రోగులకు పది రోజుల పాటు అందిస్తున్నట్లు నిహారికా రెడ్డి ‘దిశ’ ప్రతినిధికి తెలిపారు. షేరింగ్ ఈజ్ కేరింగ్ కాన్సప్ట్‌తో గత సంవత్సరం కాలంగా నిరుపేద కుటుంబాలకు గ్రాసరీస్ సరఫరా చేస్తున్నామన్నారు. కరోనా సెంకడ్ వేవ్ ఎంతో మందిని అల్ల కల్లోలం చేస్తుందని, తన వంతు కృషిగా ఉచిత భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత భోజన కోసం క్యారంటైన్‌లో ఉన్న కరోనా రోగులు 97018 21089 సంప్రదించవచ్చని నిహారికా రెడ్డి కోరారు.