- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పుగల్లులో ఉచితంగా కంటి, డయాబెటిక్ స్క్రీనింగ్ పరీక్షలు
దిశ, జఫర్‌గడ్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామంలో లయన్స్ క్లబ్, శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు, గ్రామ ప్రజలకు శనివారం ఉచిత కంటి, డయాబెటిక్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఎంఈఓ బత్తిని రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడారి కనకయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుభాష్ మాట్లాడుతూ వ్యవసాయ పనుల్లో, రోజువారీ కూలీ పనుల్లో నిమగ్నమై ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉంటున్న పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత కంటి, డయాబెటిక్స్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఈ అవకాశాన్ని ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ కానుగంటి నిర్మల, ప్రవీణ్ కుమార్, ఉదయ్, విద్య, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.