అక్కడి వారికి ఉచితంగా వ్యాక్సిన్.. కీలక ప్రకటన చేసిన సీఎం

by Shamantha N |
అక్కడి వారికి ఉచితంగా వ్యాక్సిన్.. కీలక ప్రకటన చేసిన సీఎం
X

రాంచీ : కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు భుజాన వేసుకుంటున్నాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్ల పైబడినవారికి మాత్రమే టీకా ఉచితంగా వేస్తామని, 18-44 ఏళ్ల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ వేసుకోవచ్చుగానీ, అది తమ బాధ్యత కాదని కేంద్రం తప్పుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పనిని పూర్తి చేస్తున్నాయి. ఈ మేరకు దేశంలో ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలు 18+ వారికి ఉచితంగా టీకాలు వేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో జార్ఖండ్ కూడా చేరింది.

ఇదే విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం రాత్రి కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా సోరెన్ స్పందిస్తూ… ‘జార్ఖండ్‌లో 18 ఏళ్లు నిండినవారికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తుంది’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి రాష్ట్రప్రభుత్వం రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడుతుందని, త్వరలోనే ఈ మహమ్మారి చెర నుంచి భయటపడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed