గన్నవరం ఎయిర్‌పోర్టులో జాబ్స్.. పేరుతో మోసం

by Anukaran |
గన్నవరం ఎయిర్‌పోర్టులో జాబ్స్.. పేరుతో మోసం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వల్ల ప్రజలు కాకవికలమైతున్నారు. ఓ పక్క చేయడానికి పని లేక.. మరోపక్క చేతిలో డబ్బు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం ప్రజలు భారీగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న దుండగులు కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. అందుకు ఆన్ లైన్ ను అడ్డాగా మారుస్తున్నారు. తాజాగా కూడా ఏపీలో ఉద్యోగాల పేరిట కొత్త మోసం జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రముఖ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆన్ లైన్ లో కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్ మెంట్ లెటర్ ఆన్ లైన్ లోనే ముందుగానే పంపిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది తెలియక చాలామంది మోసపోయారు.

ఈ విషయమై ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ.. ఆన్ లైన్ లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవారి మాటలు నమ్మొద్దన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఎయిర్ లైన్స్ యొక్క నిజమైన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని.. ఇంటర్యూ చేయకుండా రిటన్ టెస్ట్ లేకుండా ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం ఇవ్వరని ఆయన పేర్కొన్నారు. ముందస్తుగా నగదు డిపాజిట్ చేయించి అపాయింట్ మెంట్ లెటర్ ఆన్ లైన్ లో పంపిస్తే అది ఫేక్ గా గుర్తించాలని డైరెక్టర్ చెప్పారు. ఉద్యోగాల సమాచారానికి సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చంటూ ఆయన చెప్పారు. అంతేకానీ, ఇతరులను నమ్మి మోసపోవొద్దన్నారు.

గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగాలు పేరిట మోసపోకుండా ముందస్తుగా తెలుసుకునేందుకు ఓ ఫోన్ నంబర్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో కూడా ఈ విధంగానే మోసపోయిన కొందరు మా దృష్టికి తీసుకువచ్చారని.. ఈ విషయంపై విజయవాడ సీపీ దృష్టికి తీసుకువెళ్లామని డైరెక్టర్ మధుసూదనరావు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed