- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణకు నాలుగు రైళ్లు
దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా నడుపుతున్న 15 ప్రత్యేక రైళ్లలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తెలంగాణకు నాలుగు రైళ్లు రానునున్నారు. మంగళవారం నుంచి ఈ నాలుగు రైళ్లు అప్ అండ్ డౌన్ రెండూ రూట్లలోనూ ప్రయాణించనున్నాయి. తెలంగాణ గుండా వెళ్లే రైళ్లలో కేఎస్‌ఆర్ బెంగళూర్ – న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్(02691/02692) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతీ రోజూ ప్రయాణిస్తుంది. ఈ నెల 13 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి న్యూఢిల్లీ వెళ్లేటపుడు ఉదయం 8 గంటలకు, బెంగళూర్ వెళ్లేటపుడు సాయంత్రం 6.30కు బయలు దేరుతుంది. సికింద్రాబాద్ స్టేషన్-న్యూఢిల్లీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(02437/02438) ఈ నెల 20వ తేదీ నుంచి వారానికి ఒకసారే ఉంటుంది. ప్రతీ బుధవారం రాత్రి మధ్యాహ్నం 01.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుండగా.. ప్రతీ ఆదివారం ఢిల్లీ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది. చెన్నయ్-న్యూఢిల్లీ (02433/02434) వారానికి రెండు రైళ్లు నడవనున్నాయి. న్యూఢిల్లీ-తిరువనంతరపురం(02432/02431) రైళ్లు వారానికి మూడుసార్లు సికింద్రాబాద్ టర్మినల్ నుంచి ప్రయాణించనున్నాయి.