- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనాలిలో ఘోరం : కారు రివర్స్ తీయమన్నందుకు ఖడ్గాలతో నరికి..
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని శీతల ప్రాంతం మనాలికి పర్యటకుల తాకిడి పెరిగింది. అక్కడి హోటళ్లు మొత్తం పర్యటకులతో నిండిపోయాయని, బెడ్స్ కూడా దొరకడం లేదని ఇటీవల హిమాచల్ టూరిజం డిపార్ట్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మనాలి పర్యటనకు వెళ్లిన నలుగురు వ్యక్తులు బీభత్సం సృష్టించారు. పంజాబ్‌కు చెందిన నలుగురు పర్యటకులు రహదారిపై అడ్డంగా నిలిపారు.
Himachal Pradesh | Four tourists from Punjab arrested for attacking public with swords in Manali after they were asked to reverse their car, which was causing traffic jam; one injured. A case has been registered under relevant sections of IPC and Arms Act: Gurdev Sharma, SP Kullu pic.twitter.com/I7TVtfHNs0
— ANI (@ANI) July 15, 2021
ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని వెంటనే కారును రివర్స్ తీయాలని తోటి వాహనదారులు అనడంతో తమ వెంట తెచ్చుకున్న తల్వార్లు( ఖడ్గాలు) తీసి వారిపై దాడికి యత్నించారు.ఈ ఘటనలో ఒకరికి గాయమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ గురుదేశ్ శర్మ ఘటనా స్థలికి చేరుకుని ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కత్తులతో వీరంగం సృష్టించిన వారిపై ఐపీసీ, ఆయుధ చట్టం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.