- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో నలుగురు అనుమానాస్పద మృతి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జిల్లాలో కలకలం రేపుతోంది. ఇంటి ఆవరణలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, అగరబత్తులు వంటివి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా రెవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అజ్మిరా బీ (63), ఆమె కూతురు అస్మాబేగం (35), అల్లుడు ఖాజాపాషా(42), మనవరాలు ఆశ్రిన్ (10), తమ ఇంట్లోనే మృత్యువాత పడ్డారు. గురువారం వరకు బాగానే ఉన్నా వీరు ఒక్కసారిగా శుక్రవారం ఉదయానికి మృతి చెందడం పట్ల గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్లోని వంట గదిలో తల్లి, హాలులో కూతుళ్ళ మృతదేహాలు పడి ఉండగా డైనింగ్ హాలులో మనవరాలు ఆశ్రిన్ మృతదేహం ఉండగా ఇంటి వెనుక భాగంలో అల్లుడి శవం పడి ఉంది. అల్లుడి శవం దగ్గర్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, తదితర వస్తువులు లభించాయి. అలాగే ఇంటి వెనుక ఒక్క గుంత, టెంకాయను ఉండడం పట్ల గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం గ్రామస్తులు విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వీరిది ఆత్మహత్య లేక హత్య అనే విషయం తేలాల్సి ఉంది.