NTPC ఫోర్ మెన్ మిస్సింగ్.. అంతుచిక్కని పజిల్..?

by Sridhar Babu |
NTPC ఫోర్ మెన్ మిస్సింగ్.. అంతుచిక్కని పజిల్..?
X

దిశ, గోదావరిఖని : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఓ అధికారి అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఆయన ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్లాడు.. అన్నదే పజిల్‌గా మారింది. పోలీసులు సదరు అధికారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనా వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్రాజెక్టు‌లో ఫోర్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపేంద్రనాథ్ రాయ్ మిస్సయ్యారు. విధులు నిర్వర్తించేందుకు యథావిధిగా సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పింకీ రాయ్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Next Story