మృత్యువు రూపంలో వచ్చిన టిప్పర్.. నలుగురు మృతి

by Sumithra |   ( Updated:2021-06-18 10:30:04.0  )
మృత్యువు రూపంలో వచ్చిన టిప్పర్.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కల్వకుర్తి రహదారిపై జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. టిప్పర్ లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు బైకులు, ట్రాక్టర్ పైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed