తౌటే తుఫాన్ బీభత్సం.. నలుగురు మృతి

by Sumithra |
తౌటే తుఫాన్ బీభత్సం.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు తౌటే తుఫాన్ పెను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా తీర ప్రాంత రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. ఈ తుఫాన్ కారణంగా కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి చిక్కమంగళూరు, ఉడిక్కి జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

వర్షాల కారణంగా కర్ణాటకలో 112 ఇళ్లు, 139 విద్యుత్​ స్తంభాలు, 22 ట్రాన్స్​ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా అప్రమత్తమైన అధికార యంత్రాంగం తీరప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్​ దళాలను రంగంలోకి దింపింది. ఈ సందర్భంగా అధికారులతో సీఎం యడియూరప్ప సమావేశం అయ్యారు. సహాయక చర్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు తెలిపారు. దాదాపు 73 గ్రామాలు సహా 7 జిల్లాల్లోని 17 తాలుకాలపై తుపాను ప్రభావం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story