పాత బస్తీలో దారుణం.. నలుగురు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్

by Sumithra |
పాత బస్తీలో దారుణం.. నలుగురు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్
X

దిశ, జల్‌పల్లి : నలుగురు పిల్లలతో కలిసి ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన నగరంలోని పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. వాదియే ముస్తఫాకు చెందిన మహ్మద్​ సాలెం పహాడి షరీఫ్​విలేజ్​చార్మినార్​ మజీద్​ప్రాంతానికి చెందిన జైనం బేగం(28)ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలదు. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 12గంటల సమయంలో భర్త మహ్మద్​సాలెంతో జైనం బేగం గొడవపడి మహ్మద్​అబ్దుల్​ఖాద్​(9), హర్ష (8), జునెత్​ (6), జుబేద్​(5)లతో కలిసి చార్మినార్​మజీద్​ ప్రాంతంలో నివసించే సోదరి భవాని ఇంటికి వచ్చింది. తిరిగి సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లలతో కలిసి జైనం బేగం ఇంటికి వెళ్తున్నానని సోదరితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. రాత్రి అయినా పిల్లలతో కలిసి బయలుదేరిన జైనం బేగం ఇంటికి చేరుకోకపోవడంతో సోదరి భవాని.. భర్త మహ్మద్​సాలెంపై అనుమానం వ్యక్తం చేస్తూ పహాడిషరీఫ్​పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story