మాజీ జెడ్పీ సీఈవో కిడ్నాప్.. ఇది ఆ ఎంపీడీవో పనేనా ?

by Shyam |   ( Updated:2021-08-28 04:29:31.0  )
మాజీ జెడ్పీ సీఈవో కిడ్నాప్.. ఇది ఆ ఎంపీడీవో పనేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కిడ్నాప్ కలకలం రేపింది. నెల్లూరు జిల్లా మాజీ జెడ్పీ సీఈవో సుబ్రమణ్యంను పుత్తూరులో కిడ్నాప్ చేసి వెంకటగిరి తీసుకొచ్చారని ఫిర్యాదు చేశారు. వెంకటగిరి ఎంపీడీవో ఆఫీసులో పనిచేస్తున్న వెంకటేశ్వర్లపై ఫిర్యాదుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే సీఈవో‌ను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story