కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ఫెర్నాండెజ్ కన్నుమూత

by Shamantha N |
Oscar Fernandez
X

తెలంగాణ బ్యూరో : కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. జూలై 18న ఉదయం యోగా చేస్తుండగా బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు. ఆ సమయంలో ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన నిర్లక్ష్యం చేశారు. రోజువారీ చెకప్‌లో భాగంగా మంగళూరులోని ఆసుపత్రికి వెళ్లగా మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ఫెర్నాండెజ్‌ను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం కన్నుమూశారు.

Advertisement

Next Story