- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళపై చేయిచేసుకున్న అశోక్ గజపతిరాజు..? ట్విస్ట్ ఏంటంటే..!
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఓ మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తనయ అతిథి గజపతితో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు వచ్చారని ఓ మహిళ పూలు జల్లుతుండగా.. అశోక్ గజపతిరాజు సహనం కోల్పోయారు. నేరుగా ఆ మహిళా కార్యకర్తకు వెళ్లి ఆమె మెడలు వంచి మరీ కొట్టారని ప్రచారం జరుగుతుంది.
అందరిలో అశోక్ గజపతిరాజు చేయ చేసుకోవడంతో ఆ మహిళా కార్యకర్త అవమానంతో ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళా దినోత్సవం రోజు మహిళలపై చేయి చేసుకోవడం బాధాకరమని మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత అన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. అయితే ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అశోక్ గజపతిరాజు ఎవరినీ కొట్టలేదంటున్నారు. ఇద్దరు మహిళలు కొట్టుకుంటుండగా వారించారని కొందరు అంటుంటే..పెద్ద బెలూన్ ను పేల్చారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. మెుత్తానికి ఈ వివాదంపై క్లారిటీ రావాలంటే అటు అశోక్ గజపతిరాజు లేదా బాధిత మహిళా అయినా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.