మమతకు షాక్.. బీజేపీలోకి మరో నేత..

by Shamantha N |
మమతకు షాక్.. బీజేపీలోకి మరో నేత..
X

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి షాక్ తగిలింది. గతనెల రాజ్యసభలో అనూహ్యంగా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన తృణముల్ కాంగ్రెస్ మాజీ నేత దినేశ్ త్రివేది ఈరోజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పియూశ్ గోయల్‌ల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఇన్నాళ్లు దినేశ్ త్రివేది సరైన పార్టీలో లేరని.. మంచి నేత, మంచి పార్టీలోకి చేరారని ఆయనను స్వాగతిస్తూ నడ్డా అన్నారు. కొన్నాళ్లుగా తాను బీజేపీలో చేరడానికి ఎదురుచూశారని, ఇది బంగారు క్షణమని అన్నారు.

Advertisement

Next Story