బౌలర్లూ జాగ్రత్త.. ధోని వస్తున్నాడు

by Shyam |
బౌలర్లూ జాగ్రత్త.. ధోని వస్తున్నాడు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో ఆడటానికి ధోని వస్తున్నాడని, కావున బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని టీం ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (Former Team India pacer Irfan Pathan) సూచించాడు. ధోనీ రిటైర్మెంట్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ (Star Sports) నిర్వహించిన ఓ ఆన్‌లైన్ కార్యక్రమంలో ఇర్ఫాన్ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబాయ్ వేదికగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌ (IPL 13th season)లో ధోని రెచ్చిపోతాడని పఠాన్ దీమా వ్యక్తం చేశాడు. కావునా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడేటప్పుడు బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. అయితే, తనతోపాటు రిటైర్ అయిన బౌలర్లందరూ సంతోషంగా ఉండొచ్చని, ఎందుకంటే ధోనికి బౌలింగ్ చేయాల్సిన అవకాశం లేదు కాబట్టి అంటూ చమత్కరించాడు.

Advertisement

Next Story