- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ దేశాలను వదిలొద్దు.. పాకిస్తాన్ క్రికెటర్లకు అక్తర్ సూచన
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీం, మరియు యాజమాన్యం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. 8 ఏళ్ల తరువాత పాకిస్తాన్‌లో పర్యటనను అంగీకరించి, చివరి నిమిషంలో న్యూజిలాండ్ టూర్ రద్దు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆటగాళ్ల భద్రత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని టూర్ రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో విదేశీ క్రికెట్ బోర్డులు పాకిస్తాన్ పర్యటనలను చివరి నిమిషంలో రద్దు చేసుకోవటంపై షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంతేగాకుండా.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లపై ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ క్రికెటర్లకు పిలుపునిచ్చారు. ‘‘ఈ అవమానాన్ని గుర్తుపెట్టుకోండి. తొందర్లోనే టీ20 ప్రపంచ కప్ ఉంది. అప్పుడు వాళ్లను అస్సలు వదిలిపెట్టకూడదు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు పాక్ ప్రతాపం చూపించాలి.’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌కు సూచించారు.