- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి : విజయశాంతి
దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రులు కేంద్రంపై అబద్దపు ప్రచారాలు చేస్తూ.. కుటిల రాజకీయాలు చేస్తున్నారు తప్ప.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ సర్కార్ చేసిందేమి లేదని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో సీఎం కేసీఆర్ఇప్పటి వరకూ అధికారులు, క్యాబినెట్‌తో ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించలేదని విమర్శించారు. కానీ రెమిడెసివర్ లభ్యత, ఆక్సిజన్కొరతను తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న సెంటర్‌పై రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
కేంద్రం పీఎం కేర్ద్వారా 5 ఆక్సిజన్ప్లాంట్లకు నిధులు ఇచ్చి విషయం నిజం కాదా..? అని ప్రశ్నించారు. మరో 12 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఫండ్స్ఇవ్వలేదా..? అని నిలదీశారు. కేంద్రం సర్కార్ కొవిడ్నియంత్రణ కోసం ఇన్ని చర్యలు తీసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడాది నుంచి ఇప్పటి వరకూ ఒక చిన్న ఆసుపత్రిని నిర్మించలేకపోయిందన్నారు.
రోజు మీడియాలో కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికే వైద్యా,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల పనికొస్తున్నారని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి చర్యలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. యుద్ధ విమానాలు ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్ల తరలింపు అమాత్యులకు కనబడడం లేదా..? అని నిలదీశారు. వెంటిలేటర్ల విషయంలో రాష్ట్ర సర్కార్ దారుణంగా విఫలమైందని, కేంద్రం ఇచ్చిన 1,250 వెంటిలేటర్లతోనే ఇప్పటికీ కాలం వెళ్లదీస్తోందని గుర్తు చేశారు. ఏడాది నుంచి కరోనా వచ్చిన రోగులు అవస్థలు పడుతుంటే ఒక్క డాక్టర్ ను కానీ ఆరోగ్య సిబ్బంది కానీ ఎందుకు భర్తీ చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.