నా మద్దతు ఈటలకే.. వారిని గద్దె దించడమే లక్ష్యం : కొండా

by Shyam |
Former MP Konda Vishweshwar Reddy
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో అనేక సమీకరణాలు ఉన్నపటికీ రాష్టంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాత్రమే జరిగే ఎన్నికలు కావని, ఈటల, కేసీఆర్‌లకు మధ్య జరుగుతున్న ఎన్నికగా భావిస్తున్నాను అన్నారు. అందుచేతనే ఈటల రాజేందర్‌కు వ్యక్తిగతంగా మద్దతు తెలియజేస్తున్నట్లు కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పట్లో ఏ రాజకీయ పార్టీలో చేరాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. భవిష్యత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తానని కుండ బద్దలు కొట్టారు.

Advertisement

Next Story