ఎక్కడికక్కడ సమస్యలు.. నిర్లక్ష్యంగా ప్రభుత్వం

by Shyam |   ( Updated:2020-07-28 08:03:37.0  )
ఎక్కడికక్కడ సమస్యలు.. నిర్లక్ష్యంగా ప్రభుత్వం
X

దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యలపై నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సందర్శించి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా వివిధ గ్రామాలు, మండలాల్లో ఎక్కడికక్కడ చేనేత కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.8 వేల జీవన భృతిని చెల్లించాలని, నిల్వ ఉన్న చేనేత వస్త్రాలని కొనుగోలు చేయాలన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed