- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదంలో వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కొడుకు.. సొంత బిడ్డతోనే అసభ్యంగా
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కొడుకుపై హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది. సొంత బిడ్డతోనే అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతని భార్య జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వివరాలలోకి వెళితే.. వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కుమారుడు(45) అమెరికా లో చదువుకొని హైదరాబాద్ లో ఉంటున్నాడు. అతనికి భార్య(38), ఒక కుమార్తె(14), కుమారుడు (11) ఉన్నారు. అయితే గత కొద్దీ కాలంగా భార్యాభర్తల మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భార్య, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లి, విడాకుల కోసం అప్లై చేశారు. తల్లిదండ్రుల విడాకుల వలన పిల్లలిద్దరూ ముభావంగా ఉంటున్నారు. దీంతో తల్లి పిల్లలను సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లింది. అక్కడ పిల్లలు చెప్పిన మాటలు విని తల్లి అవాక్కయ్యింది.
గతంలో తన తండ్రి తమతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని స్నేహితుడితో కలిసి తమను వేధించాడని తెలిపారు. అంతేకాకుండా తన తండ్రి పక్కన ఉన్నప్పుడే అతని స్నేహితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అది చూసినా తన తండ్రి ఏమి మాట్లాడకపోగా, తాను సైతం తనని వేధించాడని కుమార్తె తెలపడంతో.. వెంటనే తల్లి భర్త పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేసి కోర్టు తరలించారు. ఇక అతని స్నేహితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.