ప్రభుత్వాల మెడలు వంచైనా.. వరి కొనుగోలు చేయిస్తాం

by Sridhar Babu |
Former MLA Vijaya Ramana Rao
X

దిశ, పెద్దపల్లి: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ యాసంగిలో వరి సాగుపై మాట్లడటం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమేంటో తెలుస్తోందని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని గొప్పలు చెప్పి, ఇప్పుడు యాసంగిలో వరిధాన్యం పండించొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరిని ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి సాగులో వరిధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా వరిధాన్యం కొనుగోలు చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సురేష్ గౌడ్, కౌన్సిలర్ మల్లయ్య, సంపత్, కుమార్, శ్రీమాన్, సుభాష్, సర్వర్ పాషా, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed