పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల కన్నుమూత

by Shyam |   ( Updated:2021-01-11 09:37:25.0  )
పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల కన్నుమూత
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : పాల‌కుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస‌రావు సోమ‌వారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఇటీవలే హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. మంగ‌ళ‌వారం హ‌న్మ‌కొండ‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ల్ల‌బెల్లి గ్రామానికి చెందిన దుగ్యాల 2004 ఎన్నిక‌ల్లో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి ఎన్‌.సుధాక‌ర్‌పై విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల్లో దుగ్యాల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా నియోజ‌క‌వ‌ర్గంపై దుగ్యాల త‌న‌దైన ముద్ర‌వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌టంతో వంద‌ల కోట్ల నిధుల‌తో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కృషి చేశార‌నే చెప్పాలి. 2009ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు చేతిలో కేవ‌లం 2,600 ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. అలాగే 2014 ఎన్నిక‌ల్లోనూ వీరిద్ద‌రి మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ జ‌రిగింది. దుగ్యాల‌పై ద‌యాక‌ర్‌రావు 4,313 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. 2015నుంచి అనారోగ్యం రీత్య‌ా దుగ్యాల క్రియాశీల రాజ‌కీయాల‌కు మెల్ల‌గా దూరమ‌వుతూ వ‌చ్చారు. శ్రీనివాస‌రావుకు భార్య దుగ్యాల సుమ‌న‌, కొడుకు, కూతురు ఉన్నారు

Advertisement

Next Story

Most Viewed