- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. సుదర్శన్ రెడ్డికి ఏమైంది..?
దిశ, బోధన్ : బోధన్ కాంగ్రెస్ పార్టీలో తిరుగు లేని నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నేడు సైలెంట్ అయ్యారు. అందుకు గల కారణాలు ఏమిటని పలువురు కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే సీనియర్ లీడర్, మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి వ్యవహార శైలి అంతుచిక్కడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. పార్టీ మీటింగులకు వరుసగా గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ స్వాగత సభ బుధవారం జిల్లా కేంద్రంలో జరిగింది. సొంత నియోజక వర్గమైన బోధన్ పరిధిలోని ఎడపల్లిలో గురువారం కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఈ మీటింగులకు సుదర్శన్ రెడ్డి హాజరు కాలేదు. టీపీసీసీ కొత్త కార్యవర్గంలో చోటు లభించలేదనే దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా సుదర్శన్ రెడ్డి సైలెంట్‌గా ఉంటున్నారు.
1994 నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా కొనసాగుతున్న ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పదవిని ఆయన ఆశించినట్లు సమాచారం. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డికి చాన్స్ ఇచ్చారు. టీపీసీసీలో చోటు దక్కలేదని పార్టీ అధిష్టానంపై అలక బూనినట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే, లిక్కర్ బిజినెస్ మెన్‌గా ఉన్న సుదర్శన్ రెడ్డి 1989లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతూ ట్రబుల్ షూటర్‌గా పేరొందారు.
బోధన్ అవమానించారని..
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి టీపీసీసీలో చాన్స్ దక్కకపోవడంపై ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధిగా గెలవని వారికి కీలక బాధ్యతలు అప్పగించి, సీనియర్ అయిన తనను గుర్తించలేదని అనుచరులతో వాపోతున్నట్లు సమాచారం. ఢిల్లీకే పరిమితమైన వారికి పదవులు ఇవ్వడం వల్ల కార్యకర్తలకు అందుబాటులో ఎవరు ఉంటారని ప్రశ్నించిన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా కాంగ్రెస్‌ను వీడలేదని, టీపీసీసీలో ప్రాధాన్యం ఇవ్వకుండా తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే గెలుపొందారు. మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు బోధన్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు.
అవమానించారని అనుచరులతో ఆవేదన. వరుసగా పార్టీ మీటింగులకు గైర్హాజరు. బోధన్ మీటింగ్‌లకు డుమ్మా. అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చిన ఆయన 1999లో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే గెలుపొందారు. మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు బోధన్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. 2014లో 10వేల మెజార్టీతో ఓడిపోయారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు.