ఈటలకు డిపాజిట్ దక్కకుండా చేస్తా.. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-07-29 03:51:41.0  )
Former minister Motkupalli Narsimhulu
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే ఈటల రాజేందర్ ఆక్రమించిన దళితుల భూముల్లో జెండాలు నాటిస్తానని, అందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈటల రాజేందర్ బావమరిది చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఆక్రమించుకున్న 40 ఎకరాల భూమిని దేవాలయ భూములను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధును అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని దానిని ఎదుర్కొనేందుకు దళితులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఈటలను ఓడించడమే లక్ష్యంగా హుజూరాబాద్‌లో పర్యటిస్తానని, డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తానని స్పష్టం చేశారు. ఈటల నువ్వు నిజాయితీగా బతికే వాడివైతే ఇన్ని ఎకరాలు ఎలా కొనుగోలు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మగాడివైతే చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్న నాయకులైన దళిత భూములు ఆక్రమిస్తే వెంటనే తిరిగి ఇవ్వాలని కోరారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వ భూములు అమ్మడంలో తప్పులేదని తేల్చి చెప్పారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌‌కు భవిష్యత్ లేదని అందుకే దానికి ఓటు వేయాలని ప్రజలను కోరబోమని స్పష్టం చేశారు.

Read more : ఉద్రిక్తత.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ vs బీజేపీ

Advertisement

Next Story

Most Viewed