మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత

by Shyam |
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి కమతం రాంరెడ్డి (84) కన్నుమూశారు. మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లోని ఆయన స్వగృహంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వయసు రీత్యా గత కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

సుదీర్ఘ కాలం పాటూ కాంగ్రెస్‌లో కొనసాగిన రాంరెడ్డి.. ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. జలగం వెంకట్రావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేశారు. 2014లో ఆయన ఆశించిన పరిగి టికెట్ ఇవ్వడానికి పార్టీ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పరిగి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018 ఎన్నికల సమయానికి రాంరెడ్డిని బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఎన్నికలు ముగిశాక ఆయన కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed