ప్రశ్నిస్తే చంపేస్తారా? సీఎంపై మాజీ మంత్రి ఫైర్

by srinivas |   ( Updated:2021-06-21 05:01:21.0  )
ప్రశ్నిస్తే చంపేస్తారా? సీఎంపై మాజీ మంత్రి ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ వద్ద టీడీపీ, జనసేన నాయకులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి లక్షలాది కుటుంబాల చిన్నాభిన్నం అయిపోయాయన్నారు. మొదటి దశ కరోనాలో నిర్లక్ష్యం వహించారని రెండో దశలో కూడా అదే నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.

రాష్ట్రంలో రెండో దశ కరోనాతో చాలా మంది హాస్పిటల్ బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక చనిపోయారని చెప్పుకొచ్చారు. ధాన్యం కొనుగోలులో చాలా దోపిడీ జరిగిందన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు కూడా ఇవ్వలేని చేతకాని ముఖ్యమంత్రి సీఎం జగన్ అని ఆరోపించారు. మీరు కోటలో ఉన్న ఒకటే పేటలో ఉన్న ఒకటే మీకు ఎందుకు అధికారం అంటూ నిట్టూర్చారు. కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అలాగే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కొవిడ్‌తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వడంతోపాటు ఫ్రంట్ లైన్ వారియర్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కి వినతిపత్రం ఇద్దామని వస్తే పోలీసులను పంపుతావా అంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి గుండ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారంటూ మండిపడ్డారు. మీకు పరిపాలన ఇచ్చింది ప్రశ్నిస్తే కేసులు పెట్టమని కాదు, మీకు పరిపాలన ఇచ్చింది ప్రశ్నించిన వారిని చంపేయడానికి కాదని ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలంటూ విరుచుకుపడ్డారు. ఒక్క రాజధానిని కట్టలేని జగన్.. మూడు రాజధానులు కడతారంటూ అంటూ మాజీమంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు

Advertisement

Next Story

Most Viewed